విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం వేగ పరిమితులపై కఠిన నిర్ణయం తీసుకుంది. మునిసిపల్ రోడ్లు, బీచ్ రోడ్డు, బీఆర్‌టీఎస్ మార్గాల్లో గరిష్ట వేగాన్ని గంటకు 40 కిలోమీటర్లుగా, జాతీయ రహదారిపై 50-60 కిలోమీటర్లుగా నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ. 1,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు సిఫారసు చేయనున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు రూ. 1,500, హెల్మెట్ ధరించని వారికి రూ. 1,000 జరిమానా విధిస్తున్నారు.