విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందివలస జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన కోన రమ (44) అనే మహిళ మృతి చెందారు. కొమ్మాదికి చెందిన రమ, శ్రీకాకుళంలోని తన చెల్లి ఇంటికి స్కూటీపై వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తలకు తీవ్ర గాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. భర్త గతంలోనే మరణించడంతో, రమ మృతితో ఆమె ఇద్దరు కొడుకులు అనాథలయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.