యారాడ: మహిళను కారుతో ఢీకొట్టిన నేవీ ఉద్యోగి

4చూసినవారు
యారాడ: మహిళను కారుతో ఢీకొట్టిన నేవీ ఉద్యోగి
బుధవారం సాయంత్రం యారాడలో నేవీ క్వార్టర్స్ మార్గం వైపు కారులో అతివేగంగా వెళ్తున్న నేవీ ఉద్యోగి అదుపుతప్పి పోల్స్‌ను ఢీకొని, నడిచి వెళుతున్న బంకా జయ అనే మహిళను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్