విశాఖపట్నంలో పెళ్లికి రెండు రోజుల ముందు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మధురవాడకు చెందిన చంద్రశేఖర్ సాగర్ నగర్ లోని ఓ స్టూడియోలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వివాహం జరగాల్సి ఉండగా, బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. శుభకార్యంతో కళకళలాడాల్సిన ఇంట్లో వరుడి మరణంతో విషాదఛాయలు అలుముకున్నాయి.