గంగవరం సమీపంలోని మాధవస్వామి టెంపుల్ వద్ద కెరటాల తాకిడికి ఒడిశాకు చెందిన రూపక్ సాయి అనే యువకుడు గల్లంతయ్యాడు. నలుగురు యువకులు బీచ్‌కు సందర్శనకు వెళ్లగా, రాళ్లపై నిలబడి ఉన్న రూపక్ సాయిని కెరటాలు లాక్కెళ్లాయి. విషయం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుడు పెదగంట్యాడ మండలం సీతానగరం నివాసి అని పోలీసులు తెలిపారు.