
వర్షం నీటితో కాల్వ పొంగిపొర్లుతోంది, ఆందోళనలో ప్రజలు
తూర్పు నియోజకవర్గం విశాఖపట్నంలోని 16వ వార్డు, కృష్ణకాలనీ రామ్ మందిర్ సమీపంలో వర్షం కారణంగా కాల్వ పొంగిపొర్లుతోంది. కాల్వను శుభ్రం చేసి సంవత్సరాలు గడిచిపోవడంతో, నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని, నీటి మళ్లింపునకు పరిశీలించాలని వారు కోరుతున్నారు.






















