
విశాఖ: ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
మంగళవారం వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, అనధికార లేఅవుట్లలో 2025 జూన్ 30 లోపు ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలు, వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్-2020 పథకం కొనసాగింపును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమబద్ధీకరణ ద్వారా చట్టబద్ధమైన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లో మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాలు వంటి ప్రయోజనాలు పొందవచ్చని ఆయన తెలిపారు.







































