
మెగాసిటీగా విశాఖ
ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామమైన విశాఖపట్నం ఇప్పుడు మెగా సిటీగా రూపాంతరం చెందనుంది. ఇప్పటికే గాజువాక, భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా మారిన విశాఖ, ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విస్తరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి తరహాలో విశాఖను మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో, విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రాంబిల్లి నుంచి అనకాపల్లి, కొత్తవలస మీదుగా భోగాపురం వరకు సుమారు 90 కిలోమీటర్ల సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది. ఈ రహదారి పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలనే యోచనలో ఉంది.







































