
విశాఖ: చోరీకి పాల్పడిన మాజీ జవాన్ అరెస్టు
విశాఖపట్నం: దొంగతనాలు చేస్తున్న మాజీ సైనికుడు కిరణ్‌ను విశాఖలోని ద్వారకా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిరణ్, ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మధారలో తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి 130 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కిరణ్ గతంలోనూ అనేక దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.







































