
గాజువాక: దువ్వాడలో అపార్ట్మెంట్లో వ్యక్తి మృతి
గాజువాక సమీపంలోని దవ్వాడ గౌరీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో పి. చక్రధరరావు (44) అనే వ్యక్తి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో సోమవారం పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా, మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. జి-టెక్ ఫార్మా నిర్వాహకుడైన చక్రధరరావు గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





































