కార్మికుల హక్కుల కోసం సిఐటియు భారీ ప్రదర్శన

3చూసినవారు
గాజువాకలోని రైతు బజార్, కుంచాలమ్మ గుడి ఎదుట, కన్యకా పరమేశ్వరి, పాత గాజువాక వద్ద జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, సిఐటియు 18వ అఖిలభారత మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి భారీ ప్రదర్శన ప్రారంభమవుతుందని, ఇందులో జివిఎంసిలో పనిచేస్తున్న పర్మినెంట్ & కాంట్రాక్టు వర్కర్స్ సభ్యులందరూ తమ కుటుంబ సభ్యులతో తప్పనిసరిగా హాజరు కావాలని యూనియన్ బాధ్యులు కరపత్రాలు పంపిణీ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు, సమాన పనికి సమాన వేతనం, కార్మికుల సంక్షేమ పథకాలు అమలు, విద్యుత్తు సవరణ చట్టం రద్దు, వర్క్ ఔట్సోర్సింగ్ ఆలోచన మానుకోవాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్