
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట
అమెరికాలోని హెచ్-1బి వీసాదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన జరిగే సమయంలో అత్యధిక శాతం మంది వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని DHS స్పష్టం చేసింది. ఇటీవలి ప్రకటనపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో విధానంలో ఎలాంటి పెద్ద మార్పు జరగలేదని, దరఖాస్తుదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే సురక్షితంగా ఉండవచ్చని తెలిపింది.




