మందుబాబులపై ‘డ్రోన్’ కన్ను: విశాఖ పోలీసుల నయా నిఘా

3చూసినవారు
విశాఖపట్నం నగరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో బీచ్ రోడ్డు, పార్కులు, నిర్మానుష్య ప్రాంతాలు, కాలనీల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా మందుబాబులను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. ఆకాశం నుంచే నిఘా పెట్టి మందుబాబుల కదలికలను గమనిస్తుండటంతో ఎక్కడ మద్యం సేవించినా తప్పించుకోవడం కష్టమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరవాసుల రక్షణ కోసం ఈ డ్రోన్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్