విశాఖపట్నం తుంగ్లాం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా స్లాబ్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో బుద్ధిశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయ్ అనే ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.