గాజువాక‌: విద్యార్థుల‌కు ఆర్థిక సాయం

2చూసినవారు
గాజువాక‌: విద్యార్థుల‌కు ఆర్థిక సాయం
గంజిపేటలోని శ్రీ అంగాల పరమేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా, ఆలయ నిర్మాణ భాగస్వామి గొలుసు గణేష్ ఆర్థికంగా వెనుకబడిన పదిమంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. చదువుపై మక్కువతో తాను ఎన్నో కష్టాలను అధిగమించి ఉన్నత స్థితికి చేరుకున్నానని, పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సాయం చేస్తున్నట్లు గణేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్