గాజువాక: 30 సిలిండర్లతో గ్యాస్ బాయ్ పరార్

3చూసినవారు
గాజువాక: 30 సిలిండర్లతో గ్యాస్ బాయ్ పరార్
స్థానిక మణికంఠ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అప్పారావు అనే వ్యక్తి శనివారం 30 సిలిండర్లతో పరారయ్యాడు. వినియోగదారుల నుంచి ఓటీపీలు సేకరించి, సిలిండర్లు ఇవ్వకుండానే అతను పారిపోయాడు. మోసపోయినట్లు గ్రహించిన లబ్ధిదారులు ఏజెన్సీ వద్దకు చేరుకుని నిర్వాహకులను నిలదీశారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో ఏజెన్సీని సందర్శించి, పర్యవేక్షణ లోపంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ఫిర్యాదు మేరకు గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్