
రష్యా ఇంధనంపై అమెరికా సుంకాలు.. భారత్కు ముప్పు?
రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలను కట్టడి చేసేందుకు అమెరికా సెనేట్ 'శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2026' బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారితే, రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే భారత్, చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ దేశాలపై అమెరికా 100% వరకు సుంకాలను విధించనుంది. భారత్, చైనా సహా 5 దేశాలు ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థికంగా సహకరిస్తున్నాయని, కొత్త చట్టంతో దీన్ని అడ్డుకోవాలని అమెరికా సెనేటర్లు భావిస్తున్నారు.




