గాజువాక; లారీ ఢీకొని వ్యక్తి మృతి

54చూసినవారు
గాజువాక; లారీ ఢీకొని వ్యక్తి మృతి
షీలానగర్ పోర్ట్ కనెటివ్ట్ టి మారుతి సర్కిల్ వద్ద బైక్ ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న పరవాడకు చెందిన అశోక్ రెడ్డి (45) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్