గాజువాక: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు రద్దు చేయాలి

4చూసినవారు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మంగళవారం లంకెలపాలెం జంక్షన్‌లో వినూత్న నిరసన చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపుతో ఆటో కార్మికులు, సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని సీఐటీయూ మండల గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నులను తగ్గించి ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిరసనలో శ్రీ మారిడిమాంబ ఆటో యూనియన్ నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you