గాజువాక: 4నుంచి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన

0చూసినవారు
గాజువాక: 4నుంచి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన
గాజువాకలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జూన్ 4, 8, 12 తేదీల్లో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు. జూన్ 4న కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, బీహెచ్‌పీవీ జంక్షన్‌లలో, జూన్ 8న రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 12న పాత గాజువాక జంక్షన్‌లో భారీ నిరసన చేపట్టనున్నారు. ఈ నిరసనలను విజయవంతం చేయడంతో పాటు పార్టీ కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :