గాజువాక: వార్డు సమస్యలు పరిష్కరించండి

740చూసినవారు
గాజువాక: వార్డు సమస్యలు పరిష్కరించండి
విశాఖలోని జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు, గురువారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావుకు వార్డులోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణం, సామాజిక భవనాలు, ప్రధాన కాలువల పునర్నిర్మాణం, తాగునీటి పైపులైన్ల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మేయర్ సానుకూలంగా స్పందించి, త్వరలో వార్డులో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్