గాజువాక: క్రీడలతోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు

4చూసినవారు
గాజువాక: క్రీడలతోనే చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు
సోమవారం గాజువాకలోని భానోజీతోటలోని గాజువాక క్రికెట్ అకాడమీలో క్రీడాకారులకు టీ-షర్టుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐఓసీ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ, క్రీడల ద్వారానే పిల్లలకు క్రమశిక్షణ, ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా అత్యంత తక్కువ రుసుముతో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న అకాడమీ నిర్వాహకుల కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కబడ్డీ క్రీడాకారుడు ఉరుకూటి కనకరాజు, సీనియర్ పాత్రికేయులు పితాని సూర్యప్రసాద్, నారాయణరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్