ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పెందుర్తి జోన్ 88వ వార్డులో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడులతో కలిసి సుమారు రూ. 2.94 కోట్ల జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దువ్వాడ సెక్టార్-1లో కళ్యాణ మండపం, డ్రైనేజీ పనులు, పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్లు మరియు రూ. 95 లక్షలతో మంచినీటి పైపులైన్ల ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.