తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వినియోగంపై గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన గురువారం ఖండించారు. దైవ ప్రసాదం పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, భక్తుల విశ్వాసాలతో చెలగాటం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.