విశాఖ ఉక్కు టౌన్‌షిప్ సెక్టార్-6లోని శివాలయంలో శుక్రవారం విజయదుర్గా పీఠం నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా వెదురుపాకకు చెందిన విజయదుర్గా పీఠం గురువుల సూచనల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ విశ్రాంత ఉన్నతాధికారులు విజయదుర్గా పీఠం విశిష్టతను భక్తులకు వివరించారు. విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.