
గ్యాస్ ఏజెన్సీ పేరుతో సైబర్ మోసం: పీఐబీ హెచ్చరిక
ప్రభుత్వ చమురు సంస్థల పేర్లతో సైబర్ మోసగాళ్లు ఎల్పీజీ డీలర్షిప్ ఇస్తామని నమ్మించి అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ ఈమెయిల్లు, ఎస్ఎంఎస్ల ద్వారా వ్యక్తిగత వివరాలు, డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ మోసాలపై కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వ్యక్తిగత ఈమెయిల్లు, ఎస్ఎంఎస్ల ద్వారా డీలర్షిప్ ఆఫర్లు పంపవని, అధికారిక పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్రమత్తతతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.




