పాన్ షాపుల్లో మద్యం అమ్మకాలు: ఇద్దరి అరెస్ట్, కేసులు నమోదు

207చూసినవారు
పాన్ షాపుల్లో మద్యం అమ్మకాలు: ఇద్దరి అరెస్ట్, కేసులు నమోదు
మంగళవారం, పాయకరావుపేట మండలంలోని అరట్లకోట, మంగవరం గ్రామాల్లోని పాన్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. అరట్లకోటలో ఒక యువకుడి నుంచి ఐదు ఆఫీసర్స్ ఛాయిస్ క్వార్టర్ బాటిళ్లు, మంగవరంలో ఒకరి నుంచి మూడు లాన్సర్ విస్కీ, మూడు ఏసీ బ్లాక్ క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ పురుషొత్తమ్, ఏఎస్ఐ గోవిందరావు తెలిపారు. సిఐ గంటలాన అప్పన్నబాబు ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి.

సంబంధిత పోస్ట్