విశాఖపట్నంలో మేడే వేడుకలు: కార్మికులు, నాయకులు జెండాలు ఆవిష్కరించారు

958చూసినవారు
విశాఖపట్నంలో మేడే వేడుకలు: కార్మికులు, నాయకులు జెండాలు ఆవిష్కరించారు
విశాఖపట్నం, గాజువాకలో మేడే సందర్భంగా జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు మేడే జెండాలు ఆవిష్కరించారు. కార్ల్ మార్క్స్, లెనిన్ వంటి నాయకులు వెలిగించిన విప్లవ జ్యోతిని ముందుకు తీసుకుపోవాలని, ప్రపంచ కార్మికులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేకులు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ 140వ మైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గొలగాని అప్పారావు, నక్క నాగరాజు, గొల్ల రాము, మీనాక్షి, సత్యవతి, ఎన్ రాజు, ఎస్ గణేష్, సూరిబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్