బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

4చూసినవారు
బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
విశాఖలోని పాత గాజువాక బస్టాండ్‌లో సుమారు 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం బస్టాండ్‌లో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడు వడదెబ్బతో మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్