గాజువాక: ప్రేమజంట ఆత్మహత్య

1072చూసినవారు
విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గాజువాక పరిధిలోని షీలానగర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో కాలనీలో నివాసం ఉంటున్న సుష్మిత, దుర్గారావు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో దుర్గారావు, సుష్మిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్