విశాఖ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ధరలు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన బుధవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. వైద్యం పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టి, సామాన్యులకు నాణ్యమైన వైద్యం సరసమైన ధరలకే అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.