విశాఖ‌: టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే వెనుదిరిగిన ఎయిర్ ఇండియా

0చూసినవారు
విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా తిరిగి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 10 నిమిషాల ప్రయాణం తర్వాత పైలట్లు లోపాన్ని గుర్తించి, భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ ఘటనతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఇదే విమానంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్