విశాఖ: పెళ్లి పేరుతో విద్యార్థినిపై అరాచకం: సీపీకి ఫిర్యాదు

0చూసినవారు
విశాఖ: పెళ్లి పేరుతో విద్యార్థినిపై అరాచకం: సీపీకి ఫిర్యాదు
విశాఖపట్నంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి, మోసం చేసిన ఘటనపై బాధితురాలు పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించింది. నెల్లూరుకు చెందిన రాహుల్ అనే వ్యక్తి (ప్రముఖ గాయకుడి బంధువు) తనపై లైంగిక దాడి చేసి, ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేసి లక్షల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. నిందితుడు బలవంతంగా అబార్షన్ చేయించడమే కాకుండా, రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలతో చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్