గాజువాకలో న్యాయవాది సత్యవతి, తన సహాయకులు అప్పలరమణ, సదాశిరావులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీను, కొండబాబు అనే నిరుద్యోగుల నుంచి రూ.4,04,500 వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు అడగ్గా, తాను లాయర్నని, తనపై చర్యలు తీసుకోలేరని సత్యవతి ఎదురుతిరిగిందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు విచారణ చేపట్టారు.