ఆంధ్రా యూనివర్సిటీలో మంగళవారం ముగిసిన ఐఓటీ హ్యాకథాన్‌లో 'టీమ్ విజన్ నోడ్' ప్రథమ బహుమతి సాధించింది. ఆంధ్రా యూనివర్సిటీ, టీఐఈ వైజాగ్, అల్కోవ్ పార్టనర్స్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా 72 బృందాలు పాల్గొన్నాయి. విద్యార్థులు తమ వినూత్న ఐఓటి ప్రోటోటైప్‌లను ప్రదర్శించారు. 'టీమ్ సింక్రోస్' ద్వితీయ, 'టీమ్ ఐఓటి టైటాన్స్' తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి. ఏయూ వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్ విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.