విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మంగళవారం స్థానిక ప్రభుత్వ మానసిక వైద్యశాలను సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు మరియు వసతులపై ఆరా తీశారు. స్వయంగా రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రామిరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.