విశాఖ: ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ భరోసా

1చూసినవారు
విశాఖ: ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ భరోసా
విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటూ, పరిపాలనలో పారదర్శకతను పాటిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్