విశాఖ‌: మంత్రి లోకేష్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి: వైసీపీ

1చూసినవారు
విశాఖ‌: మంత్రి లోకేష్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి: వైసీపీ
విశాఖలో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బర్తరఫ్ చేయాలని నిరసన చేపట్టారు. డాబాగార్డెన్స్‌లోని డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, డీఎస్సీలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్