విశాఖపట్నంలోని ఎన్ఏడీ ఫ్లైఓవర్ ప్రాజెక్టులో భాగంగా ఆర్ఓబీ, కాకాని నగర్ అండర్ పాస్ పనులను శుక్రవారం వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్, పోలీస్ కమిషనర్ శంఖ బత్ర బాగ్చీ, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ పరిశీలించారు. మిగిలిన పనులను ఫిబ్రవరి 10 నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను చైర్మన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో, ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే లోయర్ రోటరీ రోడ్డును ఫిబ్రవరి 10 వరకు మూసివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రయాణికులు అప్పర్ రోటరీ రోడ్డును ఉపయోగించుకోవాలని సూచించారు.