విశాఖలో మద్యానికి బానిసైన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 58వ వార్డు గొందేసువాని పాలెంలో నివసిస్తున్న నాగిరెడ్డి మద్యం అలవాటుతో ఏ పనికీ వెళ్లకుండా అప్పుల్లో చిక్కుకున్నాడు. డబ్బులు లేక జీవితం పట్ల విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.