విశాఖ: పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి

1217చూసినవారు
విశాఖ: పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. ఆదివారం విశాఖలో పీవీ 105వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ, ఆర్థిక సంస్కరణలతో పీవీ దేశ గతిని మార్చారని, 16 భాషలు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఎంపీ ఎం. శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా పీవీ విగ్రహానికి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్