విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి: ఐద్వా

1835చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి: ఐద్వా
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. ఎన్. మాధవి, వై. సత్యవతి డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 1918వ రోజున జరుగుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షకు వారు సంఘీభావం ప్రకటించారు. ఇటీవల ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని, అన్యాయంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్