1770వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు దీక్షలు

2చూసినవారు
1770వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు దీక్షలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించరాదని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన ఆదివారం 1770వ రోజుకు చేరుకుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన శిబిరంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. బీహెచ్‌ఈఎల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి. టి. ప్రకాష్, బీఎస్ఎన్ఎల్ నాయకులు సాగర్, లచ్చిరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్