ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో
టీడీపీ సైకిల్ యాత్రలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.