విశాఖ: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

3చూసినవారు
విశాఖ: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్
విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. గురువారం ఆయన రైల్వే న్యూ కాలనీలోని జీవీఎంసీ, కె. ఎన్. ఎం. గర్ల్స్ హైస్కూళ్లను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. స్లిప్ టెస్టుల ద్వారా లోపాలను సరిదిద్దుకోవాలని, రోజువారీ లక్ష్యాలతో చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్