గాజువాకలో కాలుష్య నియంత్రణపై విస్తృత చర్చ

2చూసినవారు
గాజువాక ప్రాంతాన్ని కాలుష్య కోరల నుంచి రక్షించేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 142 కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. జనవిజ్ఞాన వేదిక పర్యావరణ విభాగ ప్రతినిధి డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు మాట్లాడుతూ, గాజువాకలో పెరుగుతున్న కాలుష్య ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్