Jan 20, 2026, 18:01 IST/ఖైరతాబాద్
ఖైరతాబాద్
డిగ్నీ మూవ్ సేవలు: వైకల్యం, వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడేవారికి అండ
Jan 20, 2026, 18:01 IST
శారీరక వైకల్యం, వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమైన వారికి సహాయం అందించేందుకు 'డిగ్నీ మూవ్' సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటి ప్రీమియర్ లగ్జరీ సహాయ రవాణా వ్యవస్థను సంస్థ ఎండీ వెంకట రమణ ప్రసాద్ తో కలిసి సాయి ప్రసాద్ విశ్వనాథన్ ప్రారంభించారు. అంగవైకల్యం ఉన్నవారు సులభంగా ప్రయాణించడానికి వీల్ చైర్స్ తో పాటు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సేవలు అభినందనీయమని సాయి ప్రసాద్ విశ్వనాథన్ అన్నారు.