Apr 14, 2026, 11:04 IST/ఉప్పల్
ఉప్పల్
అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది
Apr 14, 2026, 11:04 IST
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు కొంగరి శంకర్ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. మహనీయుల ఆశయాలు కొనసాగేలా ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.