Mar 09, 2026, 13:03 IST/శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి
గచ్చిబౌలిలో కల్తీ మాఫియా గుట్టురట్టు
Mar 09, 2026, 13:03 IST
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మాధాపూర్ SOT పోలీసులు పట్టుకున్నారు. శేరిలింగంపల్లి SOT టీమ్ వట్టినగులపల్లిలోని శ్రీ జస్నాత్ ట్రేడర్స్ దుకాణంపై దాడి చేసింది. రాజస్థాన్‌కు చెందిన దుకాణ యజమాని గడువు ముగిసిన వంట నూనెలను సోయాబీన్ నూనెతో కలిపి 'గోల్డ్ ఫేస్ లైట్', 'రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్' వంటి పేర్లతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.