మాడుగుల నియోజవర్గంలో రహదారుల అభివృద్ధికి 7. 89 కోట్లు మంజూరు

4చూసినవారు
మాడుగుల నియోజవర్గంలో రహదారుల అభివృద్ధికి 7. 89 కోట్లు మంజూరు
మాడుగుల నియోజకవర్గంలో వివిధ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం 7 కోట్ల 89 లక్షల రూపాయలు మంజూరు చేసిందని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు. మొత్తం నాలుగు మండలాల పరిధిలో సుమారు 90 కిలోమీటర్ల మేర 13 రహదారుల అభివృద్ధికి ఈ నిధులు కేటాయించారు. మాడుగుల బ్రాంచి రోడ్డు నిర్మాణానికి 60 లక్షలు, గొట్టివాడ మీదుగా వడ్డాది కింతలి రోడ్డుకు 40 లక్షలు, గవరవరం నుండి కాశీపురం వరకు రోడ్డు అభివృద్ధికి 25 లక్షలు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్